ఎవ్వరూ దూరం చేయలేనివి............


రేపు అనేది వున్నా.... లేకున్నా........ ఈ రోజు నాది.
నలువైపులా వ్యాపించి వున్న ప్రకృతి పచ్చదనం...
తెల్లవారి పొగమంచు కమ్ముకున్న వేళ మంచు ముత్యం....
తొలకరి వాన తనువంతా.. తడుపుతుండే చిరు చినుకు...
మురెపమైన ముద్దబంతి పై వాలి వుయ్యాలుగే... తూనీగా..
ఏటిగట్టు మీద తెరచాప లా అల్లుకున్న ఇసుక తెమ్మెరలు..
కొమ్మ చాటున దాక్కొని కూతకుసే.. కోకిల రాగం....
సాగర తీరమున ఒడ్డుకు చేరడానికి ప్రయాస పడే అలల ఆరాటం...
నా కనురెప్పల మాటున దాగియున్న నీ సుందర రూపం..
అనుక్షణం నా వెంట వుండి నడిపే నీ చక్కని చిరునవ్వు.....
ఇవన్నీ... నావే... నా కోసమే.........

అందుకే.... ఈ రోజు నాది, ఈ క్షణం నాది.
రేపు వున్నా......... లేకున్నా.........
నా నుండి ఎప్పటికీ... దూరం కానివి, కాలేనివి......
ఎవ్వరూ..... దూరం చేయలేనివి.............................

....................... నాని





నీ.... జ్ఞాపకాలు

నా కన్నుల నిండుగా నీ రూపం..........
నా మనసు నిండుగా నీ ఆలోచనలు .............
నీ...........ఊసులు...........జ్ఞాపకాలు..............

నీవే... నా జీవితం అనుకున్నా.........
మన ఆశలను గతం చేసి.............
నీవు భవిష్యత్తు వెతుక్కున్నావు........
ఇక నీవు నా జీవితం లోనికి రావని తెలిసినా......
నా మనసు నా మాట వినడం లేదు....

నీను ఎంత కాదనుకున్నా........
నీ రూపం నా కన్నులను వీడడం లేదు.
చుట్టూ ఎంత మంది వున్నా..... నేను ఒంటరినే అని అనిపిస్తుంది.
నీ జ్ఞాపకాలు నాకు నిన్నటి కలే అయినా........
ఇంకా ఆ కలలోనే......... బ్రతికేస్తున్నాను........

................. నాని.


నిరీక్షణ.......

ఏ కిరణం సోకినా ..............
ఏ పవనం తాకినా...........
ఏ మేఘం సాగినా .............
ఏ రాగం మ్రోగినా..............
నిన్నే తలచి.......... నన్నే మరచి..................
వేచియున్నాను నీకోసం అదే పనిగా..........

                      ---- గోపి బుడుమూరు.

నీకే తెలియాలి...........

అందమైన పువ్వులను ఇచ్చి........
వాటిని నువ్వే తున్చేస్తావు..........
పెదాలపై చిరునవ్వును నింపి........
నువ్వే దానిని దూరం చేస్తావు..........
నిన్నటి కలకోసం నేను ఆరాట పడలేను...........
రేపటి స్వప్నం కోసం ఎదురుచుడలేను............

మనసు ఓపలేని.. ఈ జీవిత ప్రయాణం...
ఏవైపునకు సాగుతుందో.... నీకే తెలియాలి.

....................నాని.
























సాక్ష్యం

కళ్ళల్లో ఉండవలసిన నీ రూపాన్ని.....
కలల్లో చూసుకోవలసి వస్తుంది.
హద్దేలేని మన ప్రేమకు... ప్రొద్దు సంకిపోతుంది ఆశలన్నీ ఆవిరై........
గడచిన క్షణాలన్నీ గతమై..... వూరట లేని నా మనసు ఉస్సురుమంటుంది........

నిద్ర రాక నిరాశగా నింగిని చూస్తూ.........
వేకువ జామున కలలు నిజమౌతాయని..... కన్నులు మూస్తే ........
సూర్యుని.. లేలేత కిరణాలు కలలో నిన్ను చూడకుండా అడ్డుతగిలాయి....
కలలో నిన్ను చూడలేని నా నిరాశ కంటిపాప ఫై కన్నీటి తెరగా మారింది.....

ప్రియా......

నిద్ర నశించి...నా కన్నుల చుట్టూ ఏర్పడిన ఈ నల్లని వలయాలు....
నిజమైన నా ప్రేమకు నేను చూపించగలిగే సాక్ష్యాలు....


..................నాని.


జీవితం

జీవితం అనే ఆకాశంలో.......
మెరిసే మెరుపు ఆశలైతే......
కురిసే వర్షం కన్నీళ్లు.................