Good Quotations

 
  • గొప్ప ఆలోచనలు  మరియు గొప్ప ప్రయత్నాలు అన్నీ హేలనతోనే  మొదలవుతాయి.

  • ఏదైనా గొప్ప అద్భుతం జరిగే ముందు ఎవరూ  దానిని గుర్తించలేరు, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు.

  • నీ శత్రువు మాటలు విను, ఎందుకంటే నీలోని లోపాలు.. తప్పులు బాగా తెలిసేది వారికే.

  • సంతృప్తి సాధనలో వుండదు, ప్రయత్నంలో  వుంటుంది. పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తే...                       విజయం కూడా పూర్తి స్థాయిలో అందుతుంది 

  • కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కుడా, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేదు.

  • ఓర్పు  అనేది  ఎంత చేదుగా వుంటుందో... దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా వుంటుంది.

  • విప్లవాలు.. నేరాలు.. పేదరికం నుండే పుట్టుకు వస్తాయి. 

  • కాలాన్ని వృధా చేయడమంటే.. నిన్ను నువ్వు దోపిడీ చేసుకున్నట్లే


  • ఏ ప్రాణినీ చంపకూడదు, దాని లోని దుర్మార్గాన్ని మాత్రమే చంపాలి. అలాగే దుర్మార్గాన్ని నిర్మూలిస్తే... ప్రతీ మనిషీ మంచివాడే . 

  • ఎదుటివారిని చూసి ప్రేమ పూర్వకంగా నవ్వగలిగితే... అదే వారికి నువ్విచ్చే  అందమైన బహుమతి. 

  • వైఫల్యం ఎదురవగానే నిరాశ చందకూడదు.. అది కొత్త ప్రేరణకు పునాది కావాలి. 

  • ప్రపంచం నిన్ను ఒంటరిగా వెలివేసి దూరంగా వెళ్లిపోయినపుడు, నీ పక్కన నిలబడే వాడే అసలైన నీ స్నేహితుడు.  

No comments: