Real Estate Articles by Me


భాగ్య నగరంలో  సాఫ్ట్ వేర్ రంగానికి పోటీగా స్థిరాస్థి రంగం ఎదుగుతుందంటే అందులో అతిశయోక్తి లేదు.
ఆర్ధిక మాంద్యం నుండి త్వరగా కోలుకున్న  స్థిరాస్థి రంగం అంతే వేగంగా మునుపటి వైభవాన్ని సంతరించు కోవడానికి ఎంతో సమయం పట్టేట్టు లేదు. గత సంవత్సర కాలంలో నెల నెలకూ పెరుగుతున్న ఆదరణ, కొనుగోళ్ళ దృష్ట్యా చూస్తే, పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం. రానున్న కాలంలో సొంత ఇంటి కల కొద్దిగా 'ప్రియం' కావొచ్చు.

తరం లో అంతరం :
గడచిన తరాలతో పోల్చుకుంటే ఈ తరానికి కొనుగోలు శక్తి ఎక్కువ. సరైన సంస్థ లో ఐదు సున్నాల జీతం, 25 నుండి  35 మధ్య వయస్సు, సొంత ఇంటి కల, పొదుపు మార్గంలో వెళ్ళాలన్న కోరిక, ఇవన్నీ   స్థిరాస్థి రంగంలో పెట్టుబడుల వైపు నడిపిస్తుంది. నేటి తరానికి అన్ని సదుపాయాలతో పాటు, నాణ్యమైన నిర్మాణానికి ప్రాధాన్యత యిస్తున్నారు.
వినియోగదారుని అభిరుచికి తగ్గట్లుగానే నేటి యాజమాన్యాలు కుడా అన్ని సదుపాయాలూ కలిగిన క్లబ్ హౌస్, యోగ శాల, వ్యాయామశాల, ప్రధమ చికిత్సా సదుపాయాలను కల్పిస్తున్నవి.

ఆలోచనల్లో మార్పు:
ఇంతకు ముందు రెండు పడక గదుల నిర్మాణం అంటే 500 నుండి 600 చదరపు అడుగుల  విస్తీర్ణం చాలనుకునే వినియోగదారుని ఆలోచన 800 నుండి 1000 చదరపు అడుగుల  వరకు మారింది. మూడు పడక గదుల విస్తీర్ణం అంటే తక్కువలో తక్కువగా 1200 చదరపు అడుగుల  నుండి మొదలవుతుంది. వినియోగదారుని ఆలోచనల్లో మార్పునకు తగ్గట్లు గానే నేటి స్థిరాస్థి సంస్థలు అన్ని తరగతుల ప్రజల ఆలోచనలకు అనుగుణంగా గృహములు నిర్మిస్తున్నవి.

సాంకేతిక పరిజ్ఞానం:
స్థిరాస్థి రంగంలో పోటీ పెరగడంతో, కూలీలు మరియు మేస్త్రీ ల కొరత ఏర్పడింది. దీనివలన నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు, అనుకున్న సమయంలో వినియోగదారునికి గృహాన్ని అందించడం కష్టమౌతుంది. సాధ్యమైనంత వరకు నిర్మాణ వ్యయాన్ని తగ్గించి, దాని ప్రతిఫలాన్ని వినియోగదారునికి అందేలా మరియు అనుకున్న సమయానికి వినియోగదారుని సొంత ఇంటి తాళం చెవులను తనకు అందించేలా 'జనప్రియ' సాంకేతిక మార్పులను తీసుకు వచ్చింది. తమ ప్రాజెక్టులైన మెట్రో పోలిస్, నైల్ వాలీ, ఆర్కాడియా ల నందు జర్మనీ సాంకేతిక పరిజ్ఞానాన్ని, లేక్ ఫ్రంట్ మరియు సిల్వర్ క్రెస్ట్ విల్లా ప్రోజెక్టునందు  యూరోపియన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టింది.
దీని వలన తక్కువ మానవ శక్తిని వినియోగించి, ఎక్కువ భాగం యాంత్రిక పద్దతి ద్వారానే త్వరిత గతిన వినియోగదారునికి, వాగ్దానం చేసిన సమయం కంటే ముందే తన సొంతింటి కలను నిజం చేయవచ్చు.

పథకాలు:
వినియోగదారున్ని ఆకట్టుకోవడమే ప్రధాన ధ్యేయంగా పలు ప్రముఖ స్థిరాస్థి సంస్థల యాజమాన్యాలు, వివిధ రకముల ఆకర్షనీయమైన పథకాలను పెట్టాయి. వీటిలో ముఖ్యంగా ప్రీ-ఈ ఎమ్ ఐ (ఇంటిని వినియోగదారునికి అందించే వరకు బ్యాంకు నుండి విడుదలైన సొమ్ముపై వడ్డీని యాజమాన్యాలు భరించడం) ముందస్తు బాడుగలు ఇవ్వడం మరియు గృహోపకరణాలు చెప్పుకో దగ్గవి.

ఆలస్యం అమృతం విషం:
రానున్నది స్థిరాస్థి రంగానికి మంచి కాలమే కనుక, సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారు  వేచి చూసే ధోరణికి  స్వస్తి పలికి  ఈ  మంచి  తరుణాన్ని వినియోగించు కోవడమే ఉత్తమం లేదంటే చేసిన కాలయాపనకు భవిష్యత్తులో చింతించడం తధ్యం.


                                                                                                          ...... గోపి బుడుమూరు
 





No comments: