కరిగి పోయిన కల..... కన్నీటి రూపాన జాలువారితే.......
రేపటి సూర్యోదయాన్ని చూడనన్న నా మనసు మాట కఠినం.
అలజడి చెందిన సంద్రం సైతం చిన్నబోతుందేమో......
నిలకడ లేని నా మనసు కలత చూసి.
నా తోడు రావా చెలీ.... అంటూ...............
ఊరట లేని నా ఉసురు అడిగితే.............
శిశిర ఆకుని చూసి... వసంత చిగురుల వెక్కిరింత అయింది.
నిలువజాలని నిట్ట నిలువ ప్రాణం....................
చెలి జాడ లేక నీరువారి నీరసించిపోయింది.
కర్పూరంలా కళలు కటిక చీకట్ల కాటికి చేరితే......
అడవి కాచిన వెన్నెలలా ......
వృధా అయిన నా ఎదురు చూపులకు అంతమే లేదాయే.......
....... గోపి బుడుమూరు.