కోపం చూపి గుండె ముక్కలు చేసిందే...
ఎవరో నేనంటూ చేయి విడిచి పోయిందే...
ఇన్నాళ్ల బంధాన్ని కలనుకోమంటుందే...
కలనైనా నా పేరు తలవను అంటుందే...
ఇదే మరి ప్రేమ మాయేమో...
జీవితంలో ఇక కోలుకోలేనేమో...
ఎద చప్పుడు నేనేనంటూ కనులను కలిపావు
ఎప్పుడూ నన్ను వీడిపోనంటూ హత్తుకు పోయావు
కనులను తెలిస్తే.. కనుల ముందు అన్నావు
కనులను మూస్తే.. కలలో ఉంటానన్నావు
ఆ చేసిన భాసలన్నీ ఇప్పుడు ఏమైపోయాయి
నన్ను కాదని నీ అడుగులు ఏ వైపునకు సాగాయి.
ఎటు చూసినా నీ రూపం నన్ను వెంటాడుతుంది
దరి చేరి తాకితే.. మసకబారి పోతుంది
చేసిన తప్పేంటో తెలియదంటోంది నా మనసు
నీకైనా తెలిస్తే.. చెప్పు మరి దిద్దుకుంటానంటుంది
నా గుండె పడే వేదన నీకంటూ లేదంటావా
వున్నా.. మనసు చంపుకొని బ్రతికేస్తావా..
ఎండమావి నీటి కోసం నువ్వు పరుగులు తీస్తుంటే..
వయాసిస్సులా నీ రాక కోసం ఎదురు చూస్తాను..
---- నిష్ఠ (గోపి బుడుమూరు)