**విరహం **

ఆశల పల్లకీలో ఆకాశాన్ని తాకించి.. 
ఊహల ఊయలలో  వుర్రూతలూగించి  
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూపులు  మిగిల్చి 
మన్మధుడితో మరణ పోరాటాన్ని రగిల్చి 
తనువుని వేడి సెగలతో కాల్చి.. 
క్షణాన్ని కూడా  యుగంలా మార్చగలిగే 
మహిమ గలిగిన నీకు... 
నేను పడే విరహ వేదన ఏమిటో ... 
నీకు తెలుసా ... ప్రియా...!