రేపు అనేది వున్నా.... లేకున్నా........ ఈ రోజు నాది.
నలువైపులా వ్యాపించి వున్న ప్రకృతి పచ్చదనం...
తెల్లవారి పొగమంచు కమ్ముకున్న వేళ మంచు ముత్యం....
తొలకరి వాన తనువంతా.. తడుపుతుండే చిరు చినుకు...
మురెపమైన ముద్దబంతి పై వాలి వుయ్యాలుగే... తూనీగా..
ఏటిగట్టు మీద తెరచాప లా అల్లుకున్న ఇసుక తెమ్మెరలు..
కొమ్మ చాటున దాక్కొని కూతకుసే.. కోకిల రాగం....
సాగర తీరమున ఒడ్డుకు చేరడానికి ప్రయాస పడే అలల ఆరాటం...
నా కనురెప్పల మాటున దాగియున్న నీ సుందర రూపం..
అనుక్షణం నా వెంట వుండి నడిపే నీ చక్కని చిరునవ్వు.....
ఇవన్నీ... నావే... నా కోసమే.........
అందుకే.... ఈ రోజు నాది, ఈ క్షణం నాది.
రేపు వున్నా......... లేకున్నా.........
నా నుండి ఎప్పటికీ... దూరం కానివి, కాలేనివి......
ఎవ్వరూ..... దూరం చేయలేనివి.............................
....................... నాని
1 comment:
enjoy every moment in ur life..........keep smiling sir.........Tc
Post a Comment