మట్టిముద్ద లాంటి నా మనసుకు,
మమతను చేర్చి మనిషిని చేసావు.
శిలలాంటి నన్ను శిల్పంగా మార్చి,
చేతి నేర్పు వున్న శిల్పివైనావు.
కలలా కరిగి పోతున్న నా జీవితాన్ని,
కధలా మార్చిన కవివి నీవు.
రవివర్మ చేతి కుంచేవో....
రగిలి పోతున్న విరహపు జ్వాలవో....
మరపురాని క్షణాలను నాకు మిగిల్చి,
మరలి రాని లోకాలకు చేరిన.. ఓ... ప్రియతమా,
ఏమీయగలను నేను....
నన్ను నన్నుగా.. నాకు చూపిన నీకు,
బాధను దిగమింగుతూ... భారంగా 'ఓ.. అశ్రుధార ' తప్ప.
.... గోపి బుడుమూరు.
మమతను చేర్చి మనిషిని చేసావు.
శిలలాంటి నన్ను శిల్పంగా మార్చి,
చేతి నేర్పు వున్న శిల్పివైనావు.
కలలా కరిగి పోతున్న నా జీవితాన్ని,
కధలా మార్చిన కవివి నీవు.
రవివర్మ చేతి కుంచేవో....
రగిలి పోతున్న విరహపు జ్వాలవో....
మరపురాని క్షణాలను నాకు మిగిల్చి,
మరలి రాని లోకాలకు చేరిన.. ఓ... ప్రియతమా,
ఏమీయగలను నేను....
నన్ను నన్నుగా.. నాకు చూపిన నీకు,
బాధను దిగమింగుతూ... భారంగా 'ఓ.. అశ్రుధార ' తప్ప.
.... గోపి బుడుమూరు.
No comments:
Post a Comment