
అలసి సొలసిన ప్రాణానికి..
సాయంత్రపు గాలి.. వింధ్యా మరలై తాకితే...
పులకరించిన మేను నాట్యమాడగా..
కరుణించిన మేఘం మేఘం ముద్దాడుకుని,
చిరు చినుకు నేల రాలక ముందు
నీ మోముని తాకి.. తన్మయత్వం తో...
ఉల్లి పొరల చీరను కట్టిన నీ తనువుపై జారి...
తడిసిన అందాలను ఆస్వాదిస్తుంటే...
అది చూసి.. చినుకుని రాల్చిన మేఘం మురిసిపోదా గుమ్మా...
ఆ తాకిడికి తరించేను.. చినుకైపుట్టిన దాని జన్మ..
నీ వయ్యారాలను తాకగా చినుకునైనా కాకపోతినని అసూయ...
కానీ.. ఏం చేయను.. యిదంతా ప్రకృతి చేసిన మాయ.
... నిష్ట (గోపి బుడుమూరు)
No comments:
Post a Comment