కలసి రాని కాలంలో శిధిలమైన ఓ రూపమా,
కళలను వీడి కాళ్ళ ముందుకు రాలేవు కదా?
కన్నీటి ధార సాక్షిగా వీడ్కోలు పలికాను కదా!
మరపు రాని జ్ఞాపకమై చిత్రవధ చేయకు,
పగిలిన అద్దంలో ప్రతిబింబాలై .
ముగిసిన గతం ఓ కలగా సాగిపోదని నాకు తెలుసు
ముల్లులా నా మనసును గుచ్చుకుంటుంది కూడా తెలుసు
చేసేది లేక చేతకాని వాడిలా చోద్యం చూస్తున్న నాకు,
చచ్చి నిన్ను చేరే ధైర్యం కూడా లేదు..
బ్రతికి నిన్ను మరిచి పోయే హృదయమూ కాదు.
అందుకే, నరకంలో శిక్షలన్నీ నట్టింట్లో అనుభవిస్తున్నాను.
మరుపు మనిషికి శాపం అంటారు ఈ లోకంలో
మరణందాకైనా మరుపు నా మతి ని కమ్మేస్తే..
చివరి క్షణాల్లో వుండాలనుకుంటున్నా చిన్న పిల్లాడిలా
ఎదిగిన వయసు... మరచిన మనసుతో.....
-- నిష్ఠ

No comments:
Post a Comment