************* డబ్బు... మహా చెడ్డ జబ్బు **************

సూర్యుడు నవ్వుతున్నాడు మన చరవాణి బొమ్మల్లో 
చందమామ కూడా నవ్వుతున్నాడు మన చిన్న సందేశాల్లో 
నవ్వడమే మరచిపోయిన మనుషుల మొఖాలు చూసి నవ్వుతున్నారో 
డబ్బు సంపాదనలో పడుతున్న హైరానా చూసి నవ్వుతున్నారో 
తెలియని గందరగోళం లో  వున్నాను నేను 
మనిషి కనిపెట్టిన మనీ..  మనిషితో ఎన్ని ఆటలు ఆడిస్తుందో కదా!
ఇది విధి వైపరీత్యమా... మానవ తప్పిదమా... 
ఖర్మ సిద్ధాంతం ప్రకారం 
ఎవరు చేసిన తప్పుకు శిక్ష వాళ్ళు అనుభవించాల్సిందే.. 
అది ఒక మనిషైనా... దాని జాతి మొత్తం అయినా... 
చేసిన పొరపాటును, సమర్ధించుకోవడానికి.. 
నీకు ఎన్నైనా కారణాలు ఉండొచ్చు.. కానీ,
తప్పించుకుపోవడానికి.. 
మనమేమి  కారణ జన్ములం కాదు కదా!


                                                                                            ... నిష్ట (గోపి బుడుమూరు) 





No comments: