*** నవ నాగరికత ***

ఆనాది నుండి వస్తున్న ఆచారాలకు అంతిమ వీడ్కోలు పలికి
    నవ నాగరికతలో.... కొత్త పోకడల అనాగరికం.

స్నేహం మొదలుకొని.. బంధూత్వాల వరకు

అంతా... లాభాపేక్ష...

ప్రతి నడకలో..... ప్రతి ఒక్కరి నడతలో.....

పెరుగుతున్న ధన కాంక్ష........

బాల డోలికల సంబరాలు మొదలుకొని...

చివరి అంతిమ యాత్ర వరకు.. కాసుల జల్లు

అయినా.....

వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చావని పోయేటప్పుడు తీసుకుపోడానికి...

పది మంది చెప్పుకునే మంచి పేరు తప్ప.....


                                                                 --- గోపి బుడుమూరు. 


No comments: