ఏముంది నీకు... నీకు నువ్వు తప్ప...
చెప్పుకునేందుకు ఓ పేరు తప్ప...
చేతులు చాచి వేచి చూసినా..
నీ కౌగిలికి, ప్రేమ మైళ్ళ దూరం..
అనాదిగా.. అనాధగా.. నీ కళ్ళు చెమ్మగిల్లినా
తుడిచే ధైర్యమే లేదు.. నీ చేతులకు...
నీ మనసుకు ముళ్ళు గుచ్చుకుందా అనేంత లా ఎందుకీ రోదన
భరించ లేని బాధ వర్ననాతీతమైన,
నీ కంటి ధారలు గంగా యమునలకు సమానం
ఏదో.. దాగి వుంటే ఈ ప్రపంచంలో...
నీ మనసును ఓదార్చే మంత్రదండమే.
కురిసే ప్రేమ నీకు తోడు లేకపోయినా..
నీవు కోరుకున్న ప్రేమ తీరం దాటినా..
ఏదో.. ఓ రోజు నీది..
వేచి చూడు నీదైన రోజు కోసం.
లేకుంటే...బ్రతుకు సాగుతుంది జీవన మరణం లా ...
చివరకు.. శిలలో కూడా వుట్టి పడే జీవం...
నీ జీవితంలో రాకుంటే ...
ఈ జన జీవన సమాజంలో నువ్వు ఓ.. సజీవ శిలాజం.
చెప్పుకునేందుకు ఓ పేరు తప్ప...
చేతులు చాచి వేచి చూసినా..
నీ కౌగిలికి, ప్రేమ మైళ్ళ దూరం..
అనాదిగా.. అనాధగా.. నీ కళ్ళు చెమ్మగిల్లినా
తుడిచే ధైర్యమే లేదు.. నీ చేతులకు...
నీ మనసుకు ముళ్ళు గుచ్చుకుందా అనేంత లా ఎందుకీ రోదన
భరించ లేని బాధ వర్ననాతీతమైన,
నీ కంటి ధారలు గంగా యమునలకు సమానం
ఏదో.. దాగి వుంటే ఈ ప్రపంచంలో...
నీ మనసును ఓదార్చే మంత్రదండమే.
కురిసే ప్రేమ నీకు తోడు లేకపోయినా..
నీవు కోరుకున్న ప్రేమ తీరం దాటినా..
ఏదో.. ఓ రోజు నీది..
వేచి చూడు నీదైన రోజు కోసం.
లేకుంటే...బ్రతుకు సాగుతుంది జీవన మరణం లా ...
చివరకు.. శిలలో కూడా వుట్టి పడే జీవం...
నీ జీవితంలో రాకుంటే ...
ఈ జన జీవన సమాజంలో నువ్వు ఓ.. సజీవ శిలాజం.
No comments:
Post a Comment