వెదురునైనా... వేణువుగా మారినా
చిరుగాలినైనా... సుఘంధమైనా
జన జీవన 'కాన' లో నేనో చిన్న మొక్కని
తల్లిదండ్రులు.. హితులు.. సన్నిహితులు..
మహా వృక్షాల శాఖల నీడన సేదదీరినా...
గడ్డుకాలం, గతి తప్పిన రాశుల వెటకారపు వేళ్ల చూపులు...
క్రూర మృగాల కాళ్ళ క్రిందనో... నీతి లేని పశువుల దానానో...
కంచె.. మంచె.. జాడలేని.... తీగ రాని మరుమల్లి.
నాటు వేసినా... నీరు పైవాడిదే..
తెగ పెరిగిన గుబురుల తీరం దాటుకొని
సూర్య కాంతి పడి పులకరించి ...
మొక్క.. మానుగా మారి, నలుగురిని ఆదరించి...
క్రింద సేద దీర్చి, ఫలములతో ఫలితమిచ్చి
నిన్నటి, నాలాంటి మొక్కలకు నీడ నిచ్చి
మరో కాన నిర్మాణం మరెంత దూరమో....
--- గోపి బుడుమూరు

No comments:
Post a Comment