ఆడ గుండె లోతు చూసి.. సాగరం చిన్నబోయింది
ఆమె ఆత్రుత చూసి, నింగి నివ్వెరబోయింది
సోగాసుమీద మమకారాన్ని చూసి, చందమామ చతికిలబడితే
నడుము మడత వయ్యారాన్ని కని, నదులు నివ్వెర పోయాయి.
అయినా... బ్రహ్మ ఎంత పక్షపాతి...
పిడికెడు నడుము, బారెడు జడతో...
అన్ని అందాలను ఆమెకే.. అలంకరించాడు
మగవాడే అయినా... తన వాళ్లకు
రోషమని చెప్పి, మోముకు మీసమిచ్చి...
ఆమె అందాన్ని చూడగానే..
కరిగిపోయే.. గుండెనిచ్చాడు
నవ్వుకు పోవడం తన సొంతమైతే...
నివ్వేరబోయి నిలబడడం మగవారి వంతైంది.
చందమామ, కలువభామ, సంపంగి, నదులు.. నక్షత్రాలు
దొండపండు, జామపండు, నాగుపాము.. వగైరా వగైరా ....
అన్నీ.. వారి అందాలను పొగడే సాధనాలే..
మాకంటూ... చివరకు ఏం మిగిల్చారు...
అడ్డ గాడిద.. దున్నపోతు తప్ప.
.... గోపి బుడుమూరు
ఆమె ఆత్రుత చూసి, నింగి నివ్వెరబోయింది
సోగాసుమీద మమకారాన్ని చూసి, చందమామ చతికిలబడితే
నడుము మడత వయ్యారాన్ని కని, నదులు నివ్వెర పోయాయి.
అయినా... బ్రహ్మ ఎంత పక్షపాతి...
పిడికెడు నడుము, బారెడు జడతో...
అన్ని అందాలను ఆమెకే.. అలంకరించాడు
మగవాడే అయినా... తన వాళ్లకు
రోషమని చెప్పి, మోముకు మీసమిచ్చి...
ఆమె అందాన్ని చూడగానే..
కరిగిపోయే.. గుండెనిచ్చాడు
నవ్వుకు పోవడం తన సొంతమైతే...
నివ్వేరబోయి నిలబడడం మగవారి వంతైంది.
చందమామ, కలువభామ, సంపంగి, నదులు.. నక్షత్రాలు
దొండపండు, జామపండు, నాగుపాము.. వగైరా వగైరా ....
అన్నీ.. వారి అందాలను పొగడే సాధనాలే..
మాకంటూ... చివరకు ఏం మిగిల్చారు...
అడ్డ గాడిద.. దున్నపోతు తప్ప.
.... గోపి బుడుమూరు
No comments:
Post a Comment