🌿 మా హృదయం మాట్లాడితే 🌿
(అడవి జంతువుల, పక్షుల వేదనకు స్వరం)
మేము ముందునుంచే వుండేవాళ్ళం
అడివి చెట్లల్లో, పుట్లల్లో, రాళ్ళలో, పొదల్లో..
మీ తాతలతో తగవులు లేవు
మీ తండ్రులతో తంటాల్లేవు
మీరు రాగానే మారింది మా జీవన దృశ్యం
మర రంపపు మోతలతో నాశనమైంది మా ప్రపంచం.
మీ ఇళ్ల వెలుగుల కోసం మా అరణ్యాన్ని అంధకారం చేసావు
అభివృద్ధి అన్న పేరుతో మా జీవితాల్ని మింగేశావు
మా బ్రతుకులపై చెరగని గాయాన్ని మిగులుస్తూ..
జగతిని నాశనం చేసే ఈ ప్రయాణం ఎంత వరకు..!
మా ఆక్రందనల ఘోష నీ చెవిన పడలేదా
మా నచ్చని వలస ప్రయాణ కన్నీరు కనపడలేదా
మా అడవుల్లో చొరబడి వెంటాడినా.. వేటాడినా..
అడగలేమనే హక్కుతోనే కదా.. యింత విధ్వంశం
భావి తరాల భవిష్యత్తుని పణం పెట్టి,
ప్రకృతితో నీ ఆటలు... మానవజాతి వినాశనానికి బాటలు.
జీవ వైవిధ్యం మన మనుగడకి కావాలి సోపానాలు. కానీ,
మానవ,పశు, పక్షి, వృక్షజాలాలకు, కాకూడదు స్మశానాలు.
--- నిష్ఠ (గోపి బుడుమూరు)
No comments:
Post a Comment