లిపి రాని చిలిపి మనసు చలించితే..
నషా లేకుండానే నిషగా సగం మూతపడిన కనులు
దరహాసంతో వంపులు తిరిగిన ఆధారాలు
చక్కిలిగిలి పెట్టినట్లుగా సుతారంగా ఎర్రబడ్డ చక్కిలి
నొసట కనుబొమలు ఒకదాన్ని ఒకటి ముద్దడుతుంటే...
తన్మయత్వంతో సాగిన మెడ వంపులు
తనువు ఆణువణువూ వీణ తీగలు మీటినట్లు
నరాలు జివ్వుననగ.. వొళ్ళంతా వేడెక్కి నిట్టూర్పులు
యివన్నీ నచ్చిన చెలిని తలచుకుంటేనే మొదలు
మరి పక్కనుంటే.. యింకేమౌతానో.. ఏమో....
--- గోపి బుడుమూరు.

No comments:
Post a Comment