అప్పుడప్పుడు నాలో నేను...


తెల్లవారుతుందంటే... అలారం చప్పుడు కంటే ముందు కోడి కూతలు,
పక్షుల కిల కిల రావాలు, సుప్రభాతం యివన్నీ.. షరా మామూలే.

పడకకు పోయేముందు సుష్టుగా భోజనం, గ్లాసుడు పాలు, కుదిరితే..
ఓ.. తాంబూలం వేసుకుని నిద్రపోవడం కూడా సహజమే. కానీ....

అదేంటో... నాకు పడుకోవడానికి, నిద్రపోవడానికి మధ్యలో.. ఉదయం అవుతుంది
ఉదయం అనేకంటే.. జ్ఞ్యానోదయం అంటే బాగుంటుందేమో...!!

నాలో.. ఏ మూలో నిద్రపోతున్న కవులు, రచయితలు,                                                  నేనిద్రపోవడానికి ముందు మాత్రమే లేచి నా నిద్ర చెడగొడతారు

ఏ ఏ ఆలోచనలంటే ఏం చెప్పను.. ఓ సినిమా స్టోరీ.. ఓ విప్లవ గాథ,
లేదంటే మంచి కవిత.. మరీ కాదంటే.. సమాజాన్ని ఉద్ధరించడానికే  నేను పుట్టినట్లు
నన్ను నేను హీరో గా అభివర్ణించుకుంటూ.. ఇలా చేస్తే బాగుంటుంది..                              అలాచేస్తే  బాగుంటుందని,   ఆ..  మైకంలోనే  స్కెచ్ లూ, ప్లాన్ లూ ....

హీటెక్కిన బుర్ర వున్న నిద్రను చెడగొట్టిందని...
కాస్తో.. కూస్తో.. వచ్చే కునుకు చెట్టెక్కి కూర్చుంటుంది.

నాకు నేను తమాయించుకుంటూ, మేలుకొని ఆలోచించు అని చెప్పే,
నా మనసు ఆత్రుతకి  బ్రేకులు వేసి, వచ్చే ఆవలింతలకు  చిటికెలు వేస్తూ ...
గ్లాసుడు మంచినీళ్లు త్రాగి నిద్రపోతే... మళ్లీ తెల్లవారే సరికి
ఒక్కటంటే ఒక్క విషయం గుర్తుకొచ్చిందంటే  ఒట్టు.

                         
                                                                                                   ..... నిష్ఠ 






New Song Lyrics - చెంగు చెంగు మంటు

చెంగు చెంగు మంటు వచ్చే పిల్లదాని నడుము గిల్లి
నీవైపే వచ్చేట్టు మత్తుమందేదో జల్లి
మనవైపే చూస్తుంది మైకంగా జాబిల్లి
రమ్మంటు పిలుస్తుంది జడలోని జాజిమల్లి
కొత్తగా చెప్పనా తాపానికి కొత్తర్ధం
నీ రూపు మారదా  చూసుకుంటే నువ్వద్దం
ఊహలో  కూడా అనుకోలేదు ఎప్పుడూ నేనిలా
జరుగుతుంది కళ్ళ ముందే ఎపుడో కనిన కలలా

సింగారాలు ఒలకబోస్తూ ఎందుకింత వయ్యారం
జాలువారే అందంతో ఎక్కినాదే నాకు మైకం
ఎప్పుడూ యిచ్చే ముద్దులో ఎదో పరవశం కొత్తగా
మదనుడు పూనాడేమో ఈరోజే వుంది వింతగా
ఆశగా ఎదురు చూసిన రోజులు కళ్ళముందు  నిలువగా
గిల్లుకున్నాను నన్ను నేనే అవునా కాదా అని నమ్మగా


ఎదో తెలియని ఆవేశం కట్టలు తెంచగా
అల్లుకున్నా..  తాపంతో నువ్వు నన్ను చూడగా
తెలియని అదృష్టం నా తలుపులు తట్టగా
ఒడిలో నిదురపోనా నీ తలుపులే లాలనగా
ఊహల్లో జాబిల్లి ఈ రోజు నా కనుల ముందు...
ఇంకెన్ని చిత్రాలు చూడాలో యిక మున్ముందు

                                                                ... నిష్ఠ


New Song Lyrics - ఎక్కడున్నా... ఏ వైపునున్నా

ఎక్కడున్నా...  ఏ  వైపునున్నా
నా కళ్ళు నిన్నే వెతుకుతున్నాయి
గాలానికి చిక్కిన చేప పిల్లలా
గిల గిల లాడుతున్నా.. నీ జాడ లేక
కిల కిల రావాలు ఎన్ని వినిపిస్తున్నా...
నీ గొంతు మాట లేక, నా మనసు మూగబోయింది
చుట్టూ ఎంతమంది వున్నా..
నా ప్రాణం నిన్ను చేరాలంటుంది


ఏం  మాయ చేసావో..  నా అడుగులు నీ వెనకే..
ఏం  మంత్రమెసావో.. నా తలపులు నీ కొరకే..
ఏ జపం చేయాలో.. నీ చిరునామా తెలియుటకై...
ఏ  తపంచేయాలో .. నీలో నే.. కలువుటకై...
మాటలకందని భావం రేగెను లోలోన
విరహం తాళలేకున్నా ఒడిలో చేరనా..


ఏదైమైనా ఎందాకైనా  పయనం నీతోనే
ఎవరేమన్నా ఏమనుకున్నా ఈ ప్రాణం నీకొరకే
జీవితం నువ్వే అనుకున్నా.. కడదాకా
చేజార్చి పోవద్దు.. లోకులు ఏమన్నా
జీవితమంటేనే ఒడిదుడుకుల రాదారి
నీ తోడు నాకుంటే  కానరాదింకేది
ఏనాడు రాసుందో నీకు నాకు మధ్య ఋణం
నా జంట నువ్వు కానంటే మరణించినా ఈ క్షణం

                                                            .... నిష్ఠ

సర్కారు దవాఖాన

అమ్మతనం కన్నా కమ్మదనం ఏమైనా వుందా !
అలాంటి అమ్మలను చెట్ల కొమ్మల క్రిందన
నిర్ధాక్షణ్యంగా పడిగాపులు గాయిస్తున్న సర్కారు దవాఖానాలు
అమ్మా.. అనే పిలుపు వినక ముందే.. 'అమ్మో' అని అరిపిస్తున్నాయి

నవమాసాల మోత భారం కన్నా..
ఆసుపత్రుల సిబ్బంది పైసల కోతే అధికం
తరువాతి తరం భూమి పైకి రాకముందే...
నరకం అంచుల వరకు దారి చూపిస్తున్నారు

అయ్యా.. నీవు ఓ.. అమ్మ బిడ్డవే అని గుర్తుంచుకో
నీ తల్లి లాంటి తల్లుల జీవన్మరణ వేదన చూసి
ఓ.. బాధ్యతగల పౌరుడిగా.. నీ తీరు మార్చుకో..

అమ్మంటే.. భూమిపై వెలసిన జాగత్తత్వం
తల దించుకునేలా దిగజార్చుకోకు నీ వ్యక్తిత్వం
అదే.. మనిషికి పశువుకి తేడా తెలిపే 'మానవత్వం' 

                                                                 .... నిష్ఠ  

ఆక్రోశం

వెంటపడి వెంటపడి అడిగి అడిగి వేసారాను ప్రియా
నీ ప్రేమ కోసం.. పగలనక రాత్రనకా నిదురమరచి.
నా వేదనని వెటకారం అన్నావు
నా ఎదురు చూపులను వేలెత్తి చూపావు
కళ్ళల్లో దాచుకున్న నీ రూపం..
కాన్నీరుతో జారిపోతుందేమోనని..
ఆపుకున్నా ఇన్నాళ్లు నా కంటతడిని
... ఆక్రోశించిన గుండె ఆనకట్ట తెగిపోతే,
ఆపడానికి ఆనకట్టలు లేవు ప్రియా...
ఆ వరదలోనే నువ్వు బురదయిపోతావు..

                                                  ..... నిష్ఠ 

New Song Lyrics కోపం చూపి గుండె ముక్కలు చేసిందే

కోపం చూపి గుండె ముక్కలు చేసిందే...
ఎవరో నేనంటూ చేయి విడిచి పోయిందే... 
ఇన్నాళ్ల  బంధాన్ని కలనుకోమంటుందే... 
కలనైనా నా పేరు తలవను అంటుందే... 
ఇదే మరి ప్రేమ మాయేమో...
జీవితంలో ఇక కోలుకోలేనేమో... 

ఎద చప్పుడు నేనేనంటూ కనులను కలిపావు 
ఎప్పుడూ నన్ను వీడిపోనంటూ హత్తుకు పోయావు 
కనులను తెలిస్తే.. కనుల ముందు అన్నావు 
కనులను మూస్తే.. కలలో ఉంటానన్నావు 
ఆ చేసిన భాసలన్నీ ఇప్పుడు ఏమైపోయాయి 
నన్ను కాదని నీ అడుగులు ఏ  వైపునకు సాగాయి. 

ఎటు చూసినా నీ రూపం నన్ను వెంటాడుతుంది 
దరి చేరి తాకితే.. మసకబారి పోతుంది 
చేసిన తప్పేంటో తెలియదంటోంది నా మనసు 
నీకైనా తెలిస్తే.. చెప్పు మరి దిద్దుకుంటానంటుంది 
నా గుండె పడే వేదన నీకంటూ లేదంటావా 
వున్నా.. మనసు చంపుకొని బ్రతికేస్తావా.. 
ఎండమావి నీటి కోసం నువ్వు పరుగులు తీస్తుంటే.. 
వయాసిస్సులా నీ రాక కోసం ఎదురు చూస్తాను.. 

                                                       ---- నిష్ఠ (గోపి బుడుమూరు)