New Song Lyrics - ఎక్కడున్నా... ఏ వైపునున్నా

ఎక్కడున్నా...  ఏ  వైపునున్నా
నా కళ్ళు నిన్నే వెతుకుతున్నాయి
గాలానికి చిక్కిన చేప పిల్లలా
గిల గిల లాడుతున్నా.. నీ జాడ లేక
కిల కిల రావాలు ఎన్ని వినిపిస్తున్నా...
నీ గొంతు మాట లేక, నా మనసు మూగబోయింది
చుట్టూ ఎంతమంది వున్నా..
నా ప్రాణం నిన్ను చేరాలంటుంది


ఏం  మాయ చేసావో..  నా అడుగులు నీ వెనకే..
ఏం  మంత్రమెసావో.. నా తలపులు నీ కొరకే..
ఏ జపం చేయాలో.. నీ చిరునామా తెలియుటకై...
ఏ  తపంచేయాలో .. నీలో నే.. కలువుటకై...
మాటలకందని భావం రేగెను లోలోన
విరహం తాళలేకున్నా ఒడిలో చేరనా..


ఏదైమైనా ఎందాకైనా  పయనం నీతోనే
ఎవరేమన్నా ఏమనుకున్నా ఈ ప్రాణం నీకొరకే
జీవితం నువ్వే అనుకున్నా.. కడదాకా
చేజార్చి పోవద్దు.. లోకులు ఏమన్నా
జీవితమంటేనే ఒడిదుడుకుల రాదారి
నీ తోడు నాకుంటే  కానరాదింకేది
ఏనాడు రాసుందో నీకు నాకు మధ్య ఋణం
నా జంట నువ్వు కానంటే మరణించినా ఈ క్షణం

                                                            .... నిష్ఠ

No comments: