అప్పుడప్పుడు నాలో నేను...


తెల్లవారుతుందంటే... అలారం చప్పుడు కంటే ముందు కోడి కూతలు,
పక్షుల కిల కిల రావాలు, సుప్రభాతం యివన్నీ.. షరా మామూలే.

పడకకు పోయేముందు సుష్టుగా భోజనం, గ్లాసుడు పాలు, కుదిరితే..
ఓ.. తాంబూలం వేసుకుని నిద్రపోవడం కూడా సహజమే. కానీ....

అదేంటో... నాకు పడుకోవడానికి, నిద్రపోవడానికి మధ్యలో.. ఉదయం అవుతుంది
ఉదయం అనేకంటే.. జ్ఞ్యానోదయం అంటే బాగుంటుందేమో...!!

నాలో.. ఏ మూలో నిద్రపోతున్న కవులు, రచయితలు,                                                  నేనిద్రపోవడానికి ముందు మాత్రమే లేచి నా నిద్ర చెడగొడతారు

ఏ ఏ ఆలోచనలంటే ఏం చెప్పను.. ఓ సినిమా స్టోరీ.. ఓ విప్లవ గాథ,
లేదంటే మంచి కవిత.. మరీ కాదంటే.. సమాజాన్ని ఉద్ధరించడానికే  నేను పుట్టినట్లు
నన్ను నేను హీరో గా అభివర్ణించుకుంటూ.. ఇలా చేస్తే బాగుంటుంది..                              అలాచేస్తే  బాగుంటుందని,   ఆ..  మైకంలోనే  స్కెచ్ లూ, ప్లాన్ లూ ....

హీటెక్కిన బుర్ర వున్న నిద్రను చెడగొట్టిందని...
కాస్తో.. కూస్తో.. వచ్చే కునుకు చెట్టెక్కి కూర్చుంటుంది.

నాకు నేను తమాయించుకుంటూ, మేలుకొని ఆలోచించు అని చెప్పే,
నా మనసు ఆత్రుతకి  బ్రేకులు వేసి, వచ్చే ఆవలింతలకు  చిటికెలు వేస్తూ ...
గ్లాసుడు మంచినీళ్లు త్రాగి నిద్రపోతే... మళ్లీ తెల్లవారే సరికి
ఒక్కటంటే ఒక్క విషయం గుర్తుకొచ్చిందంటే  ఒట్టు.

                         
                                                                                                   ..... నిష్ఠ 






No comments: