సర్కారు దవాఖాన

అమ్మతనం కన్నా కమ్మదనం ఏమైనా వుందా !
అలాంటి అమ్మలను చెట్ల కొమ్మల క్రిందన
నిర్ధాక్షణ్యంగా పడిగాపులు గాయిస్తున్న సర్కారు దవాఖానాలు
అమ్మా.. అనే పిలుపు వినక ముందే.. 'అమ్మో' అని అరిపిస్తున్నాయి

నవమాసాల మోత భారం కన్నా..
ఆసుపత్రుల సిబ్బంది పైసల కోతే అధికం
తరువాతి తరం భూమి పైకి రాకముందే...
నరకం అంచుల వరకు దారి చూపిస్తున్నారు

అయ్యా.. నీవు ఓ.. అమ్మ బిడ్డవే అని గుర్తుంచుకో
నీ తల్లి లాంటి తల్లుల జీవన్మరణ వేదన చూసి
ఓ.. బాధ్యతగల పౌరుడిగా.. నీ తీరు మార్చుకో..

అమ్మంటే.. భూమిపై వెలసిన జాగత్తత్వం
తల దించుకునేలా దిగజార్చుకోకు నీ వ్యక్తిత్వం
అదే.. మనిషికి పశువుకి తేడా తెలిపే 'మానవత్వం' 

                                                                 .... నిష్ఠ  

No comments: