చెంగు చెంగు మంటు వచ్చే పిల్లదాని నడుము గిల్లి
నీవైపే వచ్చేట్టు మత్తుమందేదో జల్లి
మనవైపే చూస్తుంది మైకంగా జాబిల్లి
రమ్మంటు పిలుస్తుంది జడలోని జాజిమల్లి
కొత్తగా చెప్పనా తాపానికి కొత్తర్ధం
నీ రూపు మారదా చూసుకుంటే నువ్వద్దం
ఊహలో కూడా అనుకోలేదు ఎప్పుడూ నేనిలా
జరుగుతుంది కళ్ళ ముందే ఎపుడో కనిన కలలా
సింగారాలు ఒలకబోస్తూ ఎందుకింత వయ్యారం
జాలువారే అందంతో ఎక్కినాదే నాకు మైకం
ఎప్పుడూ యిచ్చే ముద్దులో ఎదో పరవశం కొత్తగా
మదనుడు పూనాడేమో ఈరోజే వుంది వింతగా
ఆశగా ఎదురు చూసిన రోజులు కళ్ళముందు నిలువగా
గిల్లుకున్నాను నన్ను నేనే అవునా కాదా అని నమ్మగా
ఎదో తెలియని ఆవేశం కట్టలు తెంచగా
అల్లుకున్నా.. తాపంతో నువ్వు నన్ను చూడగా
తెలియని అదృష్టం నా తలుపులు తట్టగా
ఒడిలో నిదురపోనా నీ తలుపులే లాలనగా
ఊహల్లో జాబిల్లి ఈ రోజు నా కనుల ముందు...
ఇంకెన్ని చిత్రాలు చూడాలో యిక మున్ముందు
... నిష్ఠ
నీవైపే వచ్చేట్టు మత్తుమందేదో జల్లి
మనవైపే చూస్తుంది మైకంగా జాబిల్లి
రమ్మంటు పిలుస్తుంది జడలోని జాజిమల్లి
కొత్తగా చెప్పనా తాపానికి కొత్తర్ధం
నీ రూపు మారదా చూసుకుంటే నువ్వద్దం
ఊహలో కూడా అనుకోలేదు ఎప్పుడూ నేనిలా
జరుగుతుంది కళ్ళ ముందే ఎపుడో కనిన కలలా
సింగారాలు ఒలకబోస్తూ ఎందుకింత వయ్యారం
జాలువారే అందంతో ఎక్కినాదే నాకు మైకం
ఎప్పుడూ యిచ్చే ముద్దులో ఎదో పరవశం కొత్తగా
మదనుడు పూనాడేమో ఈరోజే వుంది వింతగా
ఆశగా ఎదురు చూసిన రోజులు కళ్ళముందు నిలువగా
గిల్లుకున్నాను నన్ను నేనే అవునా కాదా అని నమ్మగా
ఎదో తెలియని ఆవేశం కట్టలు తెంచగా
అల్లుకున్నా.. తాపంతో నువ్వు నన్ను చూడగా
తెలియని అదృష్టం నా తలుపులు తట్టగా
ఒడిలో నిదురపోనా నీ తలుపులే లాలనగా
ఊహల్లో జాబిల్లి ఈ రోజు నా కనుల ముందు...
ఇంకెన్ని చిత్రాలు చూడాలో యిక మున్ముందు
... నిష్ఠ
No comments:
Post a Comment